College Student Steals Gold | తమిళనాడులోని పొల్లాచ్చిలో ఓ కాలేజీ యువతి తన ప్రియుడి కోరిక తీర్చడం కోసం ఏకంగా తండ్రి స్నేహితుడి ఇంట్లోనే చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కిన వైనం స్థానికంగా సంచలనం సృష్టించింది. పొల్లాచ్చిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ సీఏ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్. జాయ్ ప్రిన్సి (19) అనే యువతికి, మక్కిన్పట్టికి చెందిన జనగన్ శివ (20) అనే యువకుడితో పరిచయం ఉంది. ఈ క్రమంలో ఆగస్ట్ 16న ప్రిన్సి తన తండ్రి స్నేహితుడైన హెచ్. తమిళసెల్వన్ ఇంటికి వెళ్ళింది. అక్కడ తమిళసెల్వన్ కూతురితో మాట్లాడుతున్న సమయంలో, ఇంట్లో ఎవరూ లేని అదను చూసి అల్మారాలో ఉన్న 9 సవర్ల (72 గ్రాముల) బంగారు ఆభరణాలను ఆమె కాజేసింది.
ఆ తర్వాత ఆ బంగారాన్ని పొల్లాచ్చిలోని ఓ జ్యువెల్లరీ దుకాణంలో సుమారు రూ. 2.5 లక్షలకు విక్రయించింది. ఆ వచ్చిన డబ్బుతో ప్రియుడు జనగన్ శివ కోరుకున్న ఖరీదైన కొత్త టూ-వీలర్ బైక్‌ను కొనుగోలు చేసి అతనికి బహుమతిగా ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఈ జంట తాము కొనుగోలు చేసిన కొత్త బైక్‌తో షోరూమ్ వద్ద కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రీల్స్ వీడియోనే వీరిద్దరిని పోలీసుల వరకు చేర్చేలా చేసింది.
మరోవైపు తన ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో బాధితుడు తమిళసెల్వన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా, ప్రిన్సి చేసిన తప్పు వెలుగులోకి వచ్చింది. ఆమె తన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆమెను కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రియుడు శివ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
தந்தையின் நண்பர் வீட்டில் 9 சவரன் நகையைத் திருடி விற்று காதலனுக்கு புதிய பைக் வாங்கிக்கொடுத்த கல்லூரி மாணவி..!#Gold | #GoldTheft | #Bike | #Love | #PolimerNews pic.twitter.com/gcz136ETHK
— Polimer News (@polimernews) September 4, 2026