Coffee | రోజూ కాఫీ తాగండి.. మరణ ముప్పును తగ్గించుకోండి!
ఎక్కువసేపు అదేపనిగా కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
Coffee | న్యూఢిల్లీ: ఎక్కువసేపు అదేపనిగా కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజూ కాఫీ తాగడం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఈ విషయంలో కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పటికీ, రోజూ కాఫీ తాగేవారు వివిధ కారణాల వల్ల చనిపోయే ముప్పు తక్కువగా ఉంటుందని వివరించారు.
10 వేలమందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నిశ్చల జీవనశైలి కలిగి కాఫీ అలవాటు ఉండేవారిలో హృద్రోగ సమస్యలతో మరణించే ముప్పు తక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. అలాగే, ఎక్కువసేపు కూర్చుని ఉండి కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో మొత్తంగా మరణాల ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు ‘సైన్స్ అలెర్ట్’లో ప్రచురితమయ్యాయి.
రోమన్ సమాధిలో 2 వేల ఏండ్ల నాటి రెడ్ వైన్..
స్పెయిన్‌లోని కర్మొనాలో గల ఒక రోమన్ సమాధిలో 2 వేల ఏండ్ల నాటి పురాతన రెడ్ వైన్‌ను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైన్‌గా ప్రస్తుతం వరకు ఉన్న క్రీ.శ.4వ శతాబ్దం నాటిదిగా చెప్తున్న వైన్ రికార్డును ఈ రోమన్ వైన్ చేజిక్కించుకుంది.
పీహెచ్ విలువ తదితర అనేక రసాయన పరీక్షల అనంతరం తాజాగా కనుగొన్న ఈ పాత వైన్ స్వచ్ఛమైనదేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఇది ఏ రకం వైన్ అనేది పరిశీలించడానికి నాటి శాంపిళ్లు ఏవీ లేవని తెలిపారు.పురుషుడి అస్థి పంజరం వైన్‌లో మునిగి ఉందని.. తద్వారా ఆ కాలంలో మహిళలు వైన్ తాగడంపై నిషేధం ఉందని వారు చెప్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

