న్యూఢిల్లీ: ఆన్లైన్లో సంచలనం నమోదు చేసిన కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party).. ఇవాళ కీలక ప్రకటన చేసింది. పార్టీ తరపున ముగ్గురు ప్రతినిధుల పేర్లను వెల్లడించింది. విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలను ప్రశ్నించేందుకు కాక్రోచ్ పార్టీ ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన ఎక్స్ అకౌంట్లో స్పందిస్తూ.. ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ ఈ పార్టీకి ముఖ్య ప్రతినిధిగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. ఇక రాజకీయ పరిశోధకుడు, ఫిల్మ్‌మేకర్ విజేత దహియా, మాజీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అశుతోష్ రాంకా ఆ సంస్థ తరపున ప్రజలతో సంభాషించనున్నారు.
భారత్‌లో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చాలన్న యోజనలో సీజేపీ ఉందని, ఆ పార్టీకి కొత్త తరం నేతలు వస్తున్నారని ఎక్స్ అకౌంట్లో తెలిపారు. న్యాయపరమైన, చట్టపరమైన, సామాజిక అంశాల్లో జర్నలిస్టు దాస్ ఫోకస్ చేయనున్నారు. 2025 నవంబర్‌లో జరిగిన కాలుష్య వ్యతిరేక ప్రదర్శనకు నాయకత్వం వహించనున్నారు. రాజకీయ విశ్లేషకుడు దహియా.. అనేక యూట్యూబ్ క్రియేటర్ల ప్రొడక్షన్లో కీలక పాత్ర పోషించారు. ఐఐటీ కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాంకా చదివారు. పర్యావరణం, విద్య, యువత సంబంధిత అంశాలపై విజయవంతంగా పబ్లిక్ ప్రచారాన్ని ఆయన ఆర్గనైజ్ చేశారు.
జూన్ 6వ తేదీన దీప్కే ఇండియా రానున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనమా కోరుతూ సీజేపీ వ్యవస్థాపకుడు డిమాండ్ చేయనున్నారు.