న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.2,000 కోట్ల విలువైన 200 కిలోల కొకైన్‌ను రమేశ్ నగర్లో ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది. గత వారమే ఢిల్లీలో రూ.5,600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వారంలోనే ఢిల్లీలో మొత్తంగా రూ.7,500 కోట్ల విలువైన 762 కిలోల డ్రగ్స్ పట్టుబడింది.
విశ్వసనీయ సమాచారంతో డ్రగ్స్ సప్లయర్‌ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసిన పోలీసులు రమేశ్‌నగర్‌లో దాడి జరిపి భారీ మొత్తంలో కొకైన్సు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నించాడని, అయితే అతడి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారని అధికారులు తెలిపారు. ఈ కొకైన్ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఉందని చెప్పారు.