న్యూఢిల్లీ, మే 26: దేశంలోని అనేక ప్రాంతాలలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధరలు కిలోకు రూ. 2 చొప్పున మంగళవారం పెరిగాయి. రెండు వారాల్లో సీఎన్జీ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. కాగా, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లు ఒత్తిడికి లోనవుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ. 2 చొప్పున పెరిగింది.
ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ చేసిన తాజా సవరణతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ. 81.09 నుంచి రూ. 83.09కి చేరుకుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో కూడా సీఎన్జీ ధరలు పెరిగాయి. నోయిడా, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడాలో సీఎన్జీ ధర కిలో రూ. 91.70 ఉండగా గురుగ్రామ్‌లో కిలో రూ. 88.12, చెన్నైలో కిలో సీఎన్జీ రూ. 95 ఉంది.