CM Vijay | ‘ప్రభుత్వ లాంఛనాలతో భాగ్యరాజ్ అంత్యక్రియలు’.. సీఎం విజయ్ ఆదేశాలు
CM Vijay | ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ (Bhagyaraj) అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం విజయ్ (CM Vijay) సంబంధిత అధికారులను ఆదేశించారు. భారతీయ సినిమాకు భాగ్యరాజ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు.
CM Vijay : ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ (Bhagyaraj) అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం విజయ్ (CM Vijay) సంబంధిత అధికారులను ఆదేశించారు. భారతీయ సినిమాకు భాగ్యరాజ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు. భాగ్యరాజ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. దర్శకుడిగా, నటుడిగా, కథా రచయితగా సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన అరుదైన ప్రతిభాశాలి భాగ్యరాజ్ అని కొనియాడారు.
భాగ్యరాజ్ తన విలక్షణమైన కథన శైలి, సహజమైన హాస్యం, గ్రామీణ నేపథ్యాలను వాస్తవికంగా చూపిన విధానంతో తమిళ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తుచేశారు. ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, మానవ విలువలు, సామాజిక అంశాలను ప్రతిబింబించాయని సీఎం విజయ్ వివరించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన భాగ్యరాజ్, 1979లో ‘సువారిల్లత చిత్రంగళ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భాగ్యరాజ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

