మద్యం సేవించే వారిపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. మద్యం సేవించే వారందరూ మహా పాపులని అభివర్ణించారు. వారిని భారతీయులుగా తాను భావించనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం సేవించి, మృతి చెందితే.. ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోదని తేల్చి చెప్పారు. మహాత్మ గాంధీ కూడా మద్యం సేవించడాన్ని వ్యతిరేకించేవారని, తన సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటే వారిని మహా పాపులని పిలిచేవారని నితీశ్ గుర్తు చేసుకున్నారు. కల్తీ మద్యం సేవిస్తే.. ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా.. ప్రజలు అటు వైపు వెళ్తున్నారని, కాబట్టి, వాటి వల్ల తలెత్తే పరిణామాలకు కూడా వారే బాధ్యత వహించాలని సీఎం నితీశ్ స్పష్టం చేశారు.
కల్తీ మద్యం సేవించి, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు సీఎం నితీశ్‌పై మండిపడుతున్నాయి.
शराब पीने वाले @NitishKumar के अनुसार हिंदुस्तानी नहीं और वो महापापी और महाअयोग्य और उनके लिए कोई सहानुभूति नहीं @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/bfTB4YU28w
— manish (@manishndtv) March 31, 2022