Puri Jagannath Temple | పూరీ జగన్నాథుడి ఆలయానికి కొత్త శోభ.. శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును ఆవిష్కరించిన సీఎం పట్నాయక్..!
Puri Jagannath Temple | పూరీ క్షేత్రంలోని జగన్నాథ దేవాలయం చుట్టూ చేపట్టిన భారీ పెరిఫెరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప (SMPP)ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఆవిష్కరించారు.
Puri Jagannath Temple | పూరీ క్షేత్రంలోని జగన్నాథ దేవాలయం చుట్టూ చేపట్టిన భారీ పెరిఫెరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప (SMPP)ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఆవిష్కరించారు. నవీన్ పట్నాయక్ సర్కారు రూ.800కోట్లతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. గజపతి మహారాజు పూరీ దిబ్యాసింగ్ దేవ్, 90 పుణ్యక్షేత్రాల ప్రతినిధులు, భక్తుల సమక్షంలో శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్నాథుడి ఆశీస్సులతోనే ఈ పాజెక్టు పూర్తయ్యిందన్నారు.

ప్రాజెక్టులో భాగంగా ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం పార్కింగ్, భక్తులు వచ్చిపోయేందుకు శ్రీమార్గ్ పేరుతో రోడ్డు నిర్మాణం, సామాగ్రి భద్రపరచుకునేందుకు క్లాక్ రూములు సహా పూరీ ఆలయం లోపల, చుట్ట పక్కల అనేక వసతులు కల్పించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో పూరీ నగరాన్ని అందంగా తీర్చిదిద్దారు. రంగురంగుల పూలు, విద్యుత్తు దీపాలు, గ్రాఫిటీ చిత్రకళతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మహాయజ్ఞం మకర సంక్రాంతి రోజున ప్రారంభించగా.. బుధవారం మధ్యాహ్నం గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేవ్ నిర్వహించిన పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. ఆ తర్వాత సీఎం నవీన్ పట్నాయక్ ప్రాజెక్టును ప్రారంభించి.. జగన్నాథుడి భక్తులకు అంకితమిచ్చారు.

2019లో ఒడిశాలోని పూరీ నగరంలో వరదలు సంభవించాయి. ఆ తర్వాత 12వ శతాబ్దానికి చెందిన ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నవీన్ పట్నాయక్‌కు సర్కారు సంకల్పించింది. ఇక్కడికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును తలపెట్టారు. రూ.800కోట్లతో జగన్నాథ ఆలయంలోని మేఘనాథ్ పచేరి చుట్టూ భారీ కారిడార్‌ను నిర్మించారు. ఇది ఆలయాన్ని వ్యవస్థీకృత పద్ధతిలో సందర్శించడానికి భక్తులకు సహాయపడనున్నది. దాంతో పాటు పార్కింగ్ ప్రాంతాలు, కొత్తగా వంతెన, యాత్రికుల రాకపోకలకు వీలుగా రోడ్డు, మరుగుదొడ్లు, జగన్నాథ దేవాలయం చుట్టూ భక్తుల కోసం క్లాక్‌రూమ్‌లు తదితర సౌకర్యాలన్నీ సమకూర్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

