e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ఢిల్లీలో త‌గ్గిన క‌రోనా ప్ర‌భావం : కేజ్రీవాల్

ఢిల్లీలో త‌గ్గిన క‌రోనా ప్ర‌భావం : కేజ్రీవాల్

ఢిల్లీలో త‌గ్గిన క‌రోనా ప్ర‌భావం : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ద‌ద‌దేశ రాజ‌ధానిని వ‌ణికించిన క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్ర‌వాల్ అన్నారు. ఢిల్లీలో చాలా రోజుల పాటు ప‌దివేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌గా ఇటీవ‌ల ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని, గ‌డిచిన 24 గంటల్లో 6500 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయ‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. న‌గ‌రంలో పాజిటివిటీ రేటు 11 శాతానికి త‌గ్గింద‌ని చెప్పారు. దేశ రాజ‌ధానిపై క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మ‌రింత త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని చెప్పుకొచ్చారు.

క‌రోనా సెకండ్ వేవ్ ను అధిగ‌మించేందుకు కేవ‌లం 15 రోజుల్లోనే 1000 ఐసీయూ బెడ్స్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చామ‌ని తెలిపారు. ప్ర‌తి జిల్లాలో త‌మ ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ బ్యాంక్ ను నెల‌కొల్పింద‌ని హోం ఐసోలేష‌న్ లో ఉన్న కొవిడ్-19 రోగుల‌కు అక్క‌డి నుంచి ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అవ‌స‌ర‌మైన వారికి త‌ర‌లిస్తున్నామ‌ని పేర్కొన్నారు. 200 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. ఒక్కో బ్యాంక్ లో 200 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను ఉంచామ‌ని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఢిల్లీలో త‌గ్గిన క‌రోనా ప్ర‌భావం : కేజ్రీవాల్

ట్రెండింగ్‌

Advertisement