ములాయం అమర్ రహే..
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు
- ‘నేతాజీ’ అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
- కుటుంబసభ్యులకు పరామర్శ.. అనంతరం యూపీ నుంచి ఢిల్లీకి
- సర్దార్ పటేల్ మార్గ్‌లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆఫీస్ పరిశీలన
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన కేసీఆర్, ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామ సైఫయీలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు ములాయం పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ములాయం కుమారుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి తదితరులు కూడా ములాయంకు నివాళి అర్పించారు. ములాయం అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత సీఎం కేసీఆర్, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ల్లారు. అక్కడ రెండు రోజులపాటు ఉండే అవకాశం ఉన్నది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తరువాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లటం ఇదే మొదటిసారి. ఢిల్లీ చేరుకొన్న తర్వాత బీఆర్ఎస్ కోసం సర్దార్ పటేల్ మార్గ్‌లో సిద్ధమవుతున్న కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో చేయాల్సిన మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జోధ్‌పూర్ వంశీయుల బంగ్లాను బీఆర్ఎస్ కార్యాలయం కోసం లీజుకు తీసుకొన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

