చండీగఢ్: ఒలింపిక్ క్రీడల్లో భారత హాకీ టీమ్‌కు మద్దతు పలకడం కోసం పారిస్ వెళ్లేందుకు సిద్ధమైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కేంద్ర ప్రభుత్వం ‘పొలిటికల్ క్లియరెన్స్’ నిరాకరించిందని అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. భగవంత్ మాన్.. ఆదివారం పారిస్‌లో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలనుకున్నారు. అయితే జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉండే సీఎం మాన్కు.. ఇంత తక్కువ సమయంలో ఆ స్థాయి భద్రత అమర్చడం సాధ్యం కాదని పేర్కొంటూ కేంద్రం ఆయనకు అనుమతి నిరాకరించిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.