న్యూఢిల్లీ: ప్రపంచంలో అతి పెద్ద ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్లో ఒకటైన క్లౌడ్ఫేర్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం మరోసారి అంతరాయం ఏర్పడింది. నవంబర్ 18న కూడా ఇదే విధంగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు. ఇలా జరగడం మూడు వారాల్లో ఇది రెండోసారి.
క్లౌడ్ఫేర్ సేవల్లో శుక్రవారం అంతరాయం వల్ల జెరోధా, ఏంజెల్ వన్, గ్రో వంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్, క్లౌడ్, పెర్ప్లెక్సిటీ వంటి ఏఐ టూల్స్, మేక్మైట్రిప్ వంటి ట్రావెల్ ప్లాట్ఫామ్స్, గూగుల్ మీట్ యూజర్స్ ఇబ్బందులు పడ్డారు. ఉపాధ్యాయులు, ఆఫీస్ టీమ్స్, విద్యార్థులు దిక్కుతోచని స్థితిని అనుభవించారు.