న్యూఢిల్లీ, నవంబర్ 20: అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇంటర్నెట్ సేవల కంపెనీ ‘క్లౌడ్‌ఫ్లేర్’లో తలెత్తిన సాంకేతిక లోపం.. గురువారం నాడూ కొనసాగింది. దీంతో అమెరికాలో వందలాది యూజర్లు ‘క్లౌడ్‌ఫ్లేర్’ సేవల్ని అందుకోలేకపోయారు. వెబ్సైట్ లోడింగ్‌లో విఫలమవుతున్నదని, ప్లాట్‌ఫామ్ ఓపెన్ అవటం లేదని 330కిపైగా అమెరికా నుంచి రిపోర్ట్ అయ్యాయని ‘డౌన్‌డిటెక్టర్’ పేర్కొన్నది.
అంతేగాక ‘అమెజాన్’ వెబ్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. గురువారం అమెరికాలో 340 మంది యూజర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వెబ్‌సైట్స్ తమ సేవలు సురక్షితంగా ఉండేందుకు, వేగంగా పనిచేసేందుకు ‘క్లౌడ్‌ఫ్లేర్’ సేవల్ని వినియోగిస్తాయి.