Clash with cops | కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన.. యూపీలో ట్రక్ డ్రైవర్లు, పోలీసులకు మధ్య ఘర్షణ.. Video
Clash with cops | కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన పలుచోట్ల ఘర్షణలకు దారితీస్తోంది. ధర్నాలో ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి ట్రక్ డ్రైవర్లు ఎదురుతిరగడంతో సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘర్షణలు జరిగాయి.
Clash with cops : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన పలుచోట్ల ఘర్షణలకు దారితీస్తోంది. ధర్నాలో ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి ట్రక్ డ్రైవర్లు ఎదురుతిరగడంతో సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘర్షణలు జరిగాయి. ఆ ఘటనను మరువకముందే ఇవాళ (మంగళవారం) ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
హిట్ అండ్ రన్ చట్టంలో కొత్తగా చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని మెయిన్‌పురిలో ధర్నా చేస్తున్న ట్రక్ డ్రైవర్లపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దాంతో ట్రక్ డ్రైవర్లు ఎదురుతిరిగి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు.
కాగా, భారతీయ న్యాయ సంహితలో భాగంగా హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కొత్త చట్టంపై ట్రక్ డ్రైవర్లు తీవ్ర వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు. ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా మూడు రోజులపాటు ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం ఉదయం నుంచి ట్రక్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతున్నది.
#WATCH | A clash broke out between truck drivers and police in Uttar Pradesh’s Mainpuri. The drivers are protesting against the new law on hit-and-run cases.
More details awaited. pic.twitter.com/aDHFnjWgK3
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

