CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
CJP | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ (Parliament Street PS) పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. నిరసన తేదీ, సమయాన్ని పోలీసులే నిర్ణయించాలని కోరారు. దీనిపై స్పందించేందుకు 24 గంటల గడువు (24 hours deadline) విధించారు.
CJP : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తలు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ (Parliament Street PS) పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. నిరసన తేదీ, సమయాన్ని పోలీసులే నిర్ణయించాలని కోరారు. దీనిపై స్పందించేందుకు 24 గంటల గడువు (24 hours deadline) విధించారు.
పోలీసులు సాధారణంగా నిరసనకు కనీసం పది రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని చెబుతుంటారని, ఈసారి మాత్రం తేదీ, సమయాన్ని పోలీసులే ఖరారు చేయాలని కోరుతున్నట్లు సీజేపీ కార్యకర్త సౌరవ్ దాస్ తెలిపారు. ఈ మేరకు పోలీసులకు 24 గంటల అల్టిమేటం ఇచ్చినట్లు వెల్లడించారు. నిరసన తేదీపై పోలీసుల నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు పార్టీ నేత అశుతోష్ రంకా అన్నారు.
అధికారులు స్పందించకపోతే 24 గంటల్లో మరో నిర్ణయం తీసుకుంటామని రంకా స్పష్టంచేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని సౌరవ్ దాస్ చెప్పారు. ప్రజలు ఇప్పటికే ఆ హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. నిరసనకు పదిరోజుల ముందే సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు పదేపదే చెబుతున్నారని తెలిపారు. అందుకే ఈసారి నిరసన తేదీ, సమయాన్ని నిర్ణయించే బాధ్యతను పోలీసులకే అప్పగిస్తున్నట్లు చెప్పారు.
అయితే ఈ వ్యవహారాన్ని నిరవధికంగా పెండింగ్‌లో ఉంచేందుకు అంగీకరించబోమని దాస్ స్పష్టంచేశారు. పోలీసులు స్పందించేందుకు 24 గంటల సమయం ఇస్తున్నామని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని పార్టీ నేతలు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

