CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
CJP protest : ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు.
CJP protest : ఢిల్లీలో సీజేపీ చేపట్టనున్న నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆందోళన జరిగే సెంట్రల్ ఢిల్లీ పరిధిలో శుక్రవారం రాత్రి 10.00 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 10, శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నారు. దీనిపై సీజేపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రకటన చేశారు. తమ ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ఆందోళనకు అనుమతి ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు.
సౌరవ్ దాస్ తమకు దరఖాస్తు చేసుకున్నారని, ఆలస్యంగా దరఖాస్తు చేసుకోవడం, గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల వారికి అనుమతి ఇవ్వడం లేదని న్యూఢిల్లీ రేంజ్ జాయింట్ కమిషనర్ నుపుర్ ప్రసాద్ తెలిపారు. అయినప్పటికీ, సీజేపీ నేతలు ఆందోళన చేపట్టే అవకాశం ఉండటంతో ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పైగా గత జూలైలో వారు చేపట్టిన ఆందోళన ఎంత హింసాత్మకంగా మారిందో తెలిసిందే.
ఈసారి అలాంటి అవకాశం లేకుండా పోలీసులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో శుక్రవారం రాత్రి 9.00 గంటల నుంచే మెట్రో రైల్ సేవలు నిలిచిపోనున్నాయి. రాత్రి 10.00 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నారు. ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ప్రకటించారు. అవసరమైతే ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకోవాలని సూచించారు. పేరేంట్స్-టీచర్స్ మీటింగ్స్ కూడా రద్దు చేసి, రీ షెడ్యూల్ చేశారు.
సీజేపీ ఆందోళన చేయాలని నిర్ణయించిన జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు ట్రాఫిక్ మళ్లించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

