CJP Leaders: జేపీ నడ్డాకు డిమాండ్ల లేఖను సమర్పించిన సీజేపీ నేతలు
CJP Leaders: సీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ప్రధాన్‌ను తొలగించాలని కోరుతూ సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, మరో నేత అశుతోష్ రాంక్కా ఓ డిమాండ్ల లేఖను మంత్రికి సమర్పించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌కు ఆ పార్టీ కార్యకర్తలు తీసిన మార్చ్ హింసాత్మకంగా మారింది. కొన్ని చోట్ల ఆ పార్టీ మద్దతుదారులపై లాఠీఛార్జ్ చేశారు. మరికొన్ని చోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో సీజేపీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు(CJP Leaders) ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ప్రధాన్‌ను తొలగించాలని కోరుతూ సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తన ఎక్స్ పోస్టులో తెలిపారు. మరో నేత అశుతోష్ రాంక్కాతో కలిసి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను పది నిమిషాల పాటు కలిసినట్లు చెప్పారు. మా డిమాండ్లకు చెందిన రాతపూర్వక లేఖను మంత్రి సమర్పించామని, అయితే ఆ డిమాండ్ల గురించి అంతర్గతంగా చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అరెస్టు చేశారు.
Abhijit Dipke detained 🥺
— Cockroach Janta Party (@CJP_for_India) July 20, 2026
సోనమ్ వాంగ్చుక్ను తక్షణమే రిలీజ్ చేయాలి. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి. ఈ మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన లేఖను మంత్రి నడ్డాకు సీజేపీ నేతలు సమర్పించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

