కరీంనగర్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : హైకోర్టు ఉత్తర్వుల మేరకు కేడీసీసీబీ చైర్మన్గా కొండూరు రవీందర్రావు సోమవారం మరోసారి బాధ్యతలు స్వీకరించారు. 2005 నుంచి వరుసగా బ్యాంకు చైర్మన్గా ఎన్నికవుతున్న ఆయన, 2025 డిసెంబర్ 19న జీవో-598 ప్రకారం బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత కలెక్టర్లు ఇన్చార్జులుగా ఉండి బ్యాంకును నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 27న కొందరు సింగిల్ విండో చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించా రు. విచారణ చేపట్టిన హైకోర్టు జీవో 598ను కొట్టివేస్తూ పాత జీవో 386 ప్రకారం పాలకవర్గాలను కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు సోమవారం తన చాంబర్లో చార్జ్ తీసుకున్నారు.