Abhijeet Dipke : ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ను దీక్ష విరమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే. ఈ మేరకు బుధవారం తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. దేశానికి సోనమ్ వాంగ్‌చుక్ అవసమరమని, అందువల్ల ఆయన దీక్ష విరమించాలని కోరారు. ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుండటంపై అభిజీత్ ఆందోళన వ్యక్తం చేశారు.
సోనమ్ వాంగ్‌చుక్ తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, దీక్ష విరమించాలని కోరారు. దేశానికి ఆయన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన కొనసాగిస్తామన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత.. ఆయన దీక్ష విరమించాలని అభిజీత్ దీప్కే కోరడం ఇదే మొదటిసారి. సోనమ్ ఆరోగ్యాన్ని ఇంకా ప్రమాదంలోకి నెట్టడం తమకు ఇష్టం లేదన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ దాదాపు 24 రోజులుగా వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
We request @Wangchuk66 sir to end his hunger strike. The country needs him, and his life is far too precious to be put at further risk.
The peaceful protest at Jantar Mantar will continue until our demands are met. pic.twitter.com/rCfygpuCH6
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 22, 2026
ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అక్కడ కూడా దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి అంశాల్లో సీజేపీతో చర్చలకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జేపీ నద్దా కూడా తెలిపారు. ఈ విషయంలో సీజేపీ నేతలకు మద్దతు లభిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఉద్యమకారులు కూడా చర్చలకు సిద్ధంగానే ఉన్నారు.