రేపు ఢిల్లీలో తిరంగా మార్చ్
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో ఈ నెల 16న ‘లెహ్రాదో తిరంగా’ (త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయండి) పిలుపుతో కొత్తగా నిరసనలు చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బుధవారం ప్రకటించారు. పార్టీ సీనియర్ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడంపై దీప్కే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అసమ్మతిని అణచివేస్తున్నదని ఆరోపించారు.
- అసమ్మతిని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వ యత్నం
- జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగురేయడమే నేరమా?
- దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ.. సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే ఫైర్
- తీహార్ జైలుకు సీజేపీ నేతలు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్
- ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో ఈ నెల 16న ‘లెహ్రాదో తిరంగా’ (త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయండి) పిలుపుతో కొత్తగా నిరసనలు చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బుధవారం ప్రకటించారు. పార్టీ సీనియర్ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడంపై దీప్కే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అసమ్మతిని అణచివేస్తున్నదని ఆరోపించారు.
ఆశు, సౌరవ్‌లను ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. వారి తప్పేంటి? జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే అని దీప్కే పేర్కొన్నారు. నరేంద్ర మోదీ..కొంచెం ధైర్యం చూపండి. అసమ్మతిని అణచివేయాలని మీకు అంతగా పట్టుదల ఉంటే ఇలాంటి పిరికిపంద చర్యల వెనుక దాక్కోవడం మానేసి అధికారికంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించే ధైర్యం చేయండి అని దీప్కే సవాలు విసిరారు. అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు త్రివర్ణ పతాకంతో దేశభక్తులందరూ సెంట్రల్ పార్క్‌కు రావాలని కోరుతున్నాను. త్రివర్ణ పతాకం ఎగరవేయడం నేరం కాదని మనం నిరూపిద్దాం అని పేర్కొన్నారు.
జ్యుడీషియల్ కస్టడీకి ఆశుతోష్, సౌరవ్
నిరసనలకు అనుమతి రద్దయిన జంతర్ మంతర్‌కు చేరుకునేందుకు ఒక ప్రైవేట్ ఆవరణలోకి చొరబడటం, శాంతిని కాపాడాలన్న బెయిల్ షరతులను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలకు బుధవారం ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్టు పోలీసులు తెలిపారు. వారి సహచరుడు అజింక్యా షిండేను ఆరు నెలల పాటు శాంతియుతంగా సత్ప్రవర్తనతో మెలిగేలా కట్టుబాటు విధించి వ్యక్తిగత పూచీకత్తు, రూ.5,000 పూచీకత్తుపై విడుదల చేసినట్టు పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం, నిందితులు పదేపదే చట్టాన్ని ఉల్లంఘించడం, బెయిల్‌పై విడుదల చేస్తే మళ్లీ చట్టాన్ని ఉల్లంఘించి ఇతరులను రెచ్చగొడతారనే అనుమానాన్ని వ్యక్తం చేసిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక ఎగ్జిక్యుటివ్ మెజిస్ట్రేట్ దాస్, రాంకాలను ఐదు రోజుల పాటు తీహార్ జైలుకు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.
నిరసనలతో హోరెత్తిన ఢిల్లీ
సెంట్రల్ ఢిల్లీ సమీపంలో బుధవారం విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు ధర్నాలు చేపట్టాయి. ‘సర్’, సీఈసీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఇండియన్ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నిరసనలు నిర్వహించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

