సీజేఐగా జస్టిస్ రమణ పదవీకాలం ఏడాది పూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులై ఆదివారానికి ఏడాది పూర్తైంది. జస్టిస్ రమణ 2021 ఏప్రిల్ 24న సీజేఐగా ప్రమాణం చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులై ఆదివారానికి ఏడాది పూర్తైంది. జస్టిస్ రమణ 2021 ఏప్రిల్ 24న సీజేఐగా ప్రమాణం చేశారు. ఈ ఏడాది కాలంలో ఆయన ఎన్నో కీలక పరిపాలన నిర్ణయాలు తీసుకొన్నారు. కోర్టుల్లో ఖాళీల భర్తీకి చర్యలను వేగవంతం చేశారు. మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం పెంచడానికి ప్రాధాన్యమిచ్చారు. న్యాయవ్యవస్థలో మార్పు కోసం అనేక ప్రతిపాదనలు చేశారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. సీజేఐగా జస్టిస్ రమణ పదవీ కాలంలో ముఖ్యమైన ఘట్టాలు.. ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది జడ్జిలను ఒకేసారి సుప్రీం కోర్టుకు నామినేట్ చేయడం, ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదించడం. దాదాపు 200 మంది జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేయడం. వీరిలో 126మంది నియామకానికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

