ఇండోర్: యాచకులు లేని నగరంగా ఇండోర్‌ను మార్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రకటించిన రూ.1000 బహుమతికి పౌరుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తమ ప్రాంతాలలో భిక్షాటన చేస్తున్న వారికి సంబంధించిన సమాచారాన్ని అందచేసి బహుమతిని పొందేందుకు ప్రజలు ముందుకు వస్తున్నట్టు అధికారులు సోమవారం తెలిపారు.
ఇండోర్‌లో భిక్షాటన, యాచకులకు దానం చేయడాన్ని నిషేధిస్తూ జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వులు ఈ నెల 2 నుంచి అమలవున్నాయి.