CISF Officer Saves Passenger’s Life | ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు.. సీపీఆర్ చేసి కాపాడిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది
CISF Officer Saves Passenger's Life | ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు.
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. (CISF Officer Saves Passenger’s Life) ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 20న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2 నుంచి శ్రీనగర్‌కు వెళ్లే విమానంలో ప్రయాణించడానికి అర్షిద్ అయూబ్ వేచి ఉన్నాడు. ఉన్నట్టుండి అతడు కుప్పకూలిపోయాడు.
కాగా, ఆ పక్కనే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఒక అధికారి తక్షణం సీపీఆర్ చేశారు. మరో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా అతడికి సహకరించారు. అర్షిద్ అయూబ్ ప్రాణాలు కాపాడారు. కాస్త కోలుకున్న అతడ్ని అంబులెన్స్‌లో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వెంటనే సీపీఆర్ చేసి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన సీఐఎస్ఎఫ్ అధికారుల చర్యను నెటిజన్లు ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాలని, స్కూల్స్, కాలేజీలో విద్యార్థులకు కూడా సీపీఆర్ విధానాన్ని నేర్పించాలని పలువురు సూచించారు.
#WATCH | A quick CPR (Cardiopulmonary resuscitation) to a passenger Arshid Ayoub by the Central Industrial Security Force’s quick reaction team played a crucial role in establising his condition. Ayoub, bound for Srinagar flight from Terminal 2 of the IGI Airport on Tuesday… pic.twitter.com/b21wZG78Oa
— ANI (@ANI) August 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CISF Officer
- CPR
- Delhi Airport
- life
RELATED ARTICLES
తాజా వార్తలు
12న మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం.. ఎల్ నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై చర్చించే అవకాశం
ఫుడ్ పాయిజన్ ఘటనపై సుమోటో కేసు.. నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆదేశం
అపార్ట్మెంట్ ఎనోవోసీకి 24 మీటర్ల పరిమితి.. ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ వెల్లడి
మరో పోరుకు నాంది పలుకుదాం
ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

