న్యూఢిల్లీ: కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన సినీ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై .. చండీఘడ్ విమానాశ్రయంలో మహిళా కానిస్టేబుల్(CISF Constable) చేయి చేసుకున్న విషయం తెలిసిందే. కంగనా చెంప చెళ్లుమనిపించిన ఆ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌పై కేసు బుక్ చేసి ఆమెను అరెస్టు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలల క్రితం రైతులు చేపడుతున్న ధర్నాలను అవమానిస్తూ కంగనా కామెంట్ చేసినట్లు ఆ కానిస్టేబుల్ ఆరోపించారు.
ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లయిట్ ఎక్కేందుకు వస్తున్న రనౌత్‌పై కానిస్టేబుల్ దాడి చేసింది. గతంలో కంగనా ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే తాను ఆ అటాక్ చేసినట్లు ఆమె చెప్పింది. వంద రూపాయలకే రైతులు ధర్నాలో పాల్గొంటారని గతంలో కంగనా పేర్కొన్నదని, తన తల్లి రైతు ధర్నాలో పాల్గొన్నదని, నిరసన తెలుపుతున్న ఆమెపై అలా మాట్లాడడం తట్టుకోలేకపోయినట్లు కానిస్టేబుల్ తెలిపింది.