Khushbu : అలనాటి ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన అందం, నటనతో దక్షిణాది భాషలలో వందలాది సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించారు. ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఆమె రాణిస్తున్నారు. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నారు. ఇంకోవైపు సినీ నిర్మాతగా కూడా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. తన భర్త సుందర్ నటించి దర్శకత్వం వహించిన అరణ్మనై 4 చిత్రానికి ఆవిడ నిర్మాతగా వ్యవహరించి ఏకంగా వంద కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టారు.
అయితే ఇటీవల కుష్బూ సుందర్ గాయపడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో కాలికి గాయంతో ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె కాలుకు కట్టు కనిపించింది. దాంతో ఆమె కాలుకు ఏమైంది..? ఆ గాయానికి కారణాలేంటి..? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె త్వరగా గాయం నుంచి కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
When you have your bestie to guard you. #ligamenttear#kneeinjury#HealingJourney pic.twitter.com/juguojUNAz
— KhushbuSundar (@khushsundar) August 27, 2024