హైదరాబాద్: సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు భాష ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి ఇండియా మల్టీ లాంగ్వేజ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ హోల్డింగ్ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో మైసూర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారతీయ భాషల అభివృద్ధిని సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వం స్థాపించిన యాప్ కంటెంట్ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి, అలాగే యూజర్లకు ఆన్లైన్లో సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి “కూ” తో కలిసి పని చేయనుంది.
ఆన్లైన్ బెదిరింపులు,తప్పుడు సమాచారం నుంచి యూజర్లకు రక్షణ కల్పించడానికి , పారదర్శకమైన ప్లాట్‌ఫామ్ రూపొందించడానికి ఈ ఒప్పందం సహాయపడనున్నది. కూ యాప్ సహ వ్యవస్థాపకుడు ,సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ “భారతీయులు బహుళ భాషల్లో సంభాషించడానికి,కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పించే ఒక ప్రత్యేకమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గా దుర్వినియోగాన్ని అరికట్టి ఆన్లైన్ వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా మాయూజర్లను మరింత బలోపేతం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని అన్నారు