రాయ్‌పూర్, నవంబర్ 8: రమణ్‌సింగ్ నేతృత్వంలోని గత బీజేపీ పాలనలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్లో కుంభకోణంతోపాటు చిట్ఫంఢ్ సంస్థల్లో అక్రమాలు జరిగాయని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఆరోపించారు. వీటిపై విచారణ జరుపాలని మంగళవారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు లేఖ రాశారు. ఈడీకి రాసిన రెండు లేఖలను ఆయన ట్వీట్ చేశారు.
ఈ రెండు కుంభకోణాలపై ఈడీ విచారణ జరుపకుంటే కోర్టును ఆశ్రయిస్తానని భూపేశ్ బఘేల్ వెల్లడించారు. చిన్న చిన్న విషయాలపై స్పందించే ఈడీ.. ఇంతపెద్ద కుంభకోణంపై ఎలాంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2019లో సివిల్ సైప్లె కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే.. ఇప్పటివరకూ దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.