న్యూఢిల్లీ : రాజకీయ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ పెగాసస్ (Pegasus Spyware )ను కేంద్రం ఉపయోగిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే. దీనిపై విచారణ జరపాలని సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు కోర్టు స్వీకరించింది.
పెగాసస్ వ్యవహారంపై వచ్చే వారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జర్నలిస్టు రామ్ తరపున కపిల్ సిబల్ పిటిషన్ దాఖలు చేశారు. పెగాసస్లో కీలక పరిణామాలు దాగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మంగళ, బుధవారాలు మినహా మిగతా రోజుల్లో విచారణకు షెడ్యూల్ చేయాలని కపిల్ సిబల్ కోరారు.
Supreme Court to hear the plea of senior journalists N Ram & Sashi Kumar next week, seeking inquiry headed by a sitting or retired judge of top court to investigate into the reports of government using Israeli software Pegasus to spy on politicians, activists, and journalists pic.twitter.com/PuBCnVfE27
— ANI (@ANI) July 30, 2021