కోర్బా: చత్తీస్‌ఘడ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన బీజేపీ అభ్యర్థి(BJP candidate) వాహనం నుంచి ఇవాళ పోలీసులు సుమారు 11.50 లక్షల నగదును సీజ్ చేశారు. రేపు ఆ రాష్ట్రంలో రెండవ దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పాలి-తనాకార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామ్ దయాల్ ఉకీ ఆ వాహనంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. జుంకిడి గ్రామంలోని పాసన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆ వాహనాన్ని సీజ్ చేశారు. నగదుకు చెందిన డాక్యుమెంట్లను మాజీ ఎమ్మెల్యే ప్రొడ్యూస్ చేయలేదని కోర్బా ఎస్పీ జితేంద్ర శుక్లా తెలిపారు. పాలి-తనాకార్ నియోజకవర్గానికి రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉకీ గతంలో బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేశారు. 2018లో బీజేపీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికల నోటిఫికేషన్ మొదలైన తర్వాత ఛత్తీస్‌ఘడ్ అధికారులు ఇప్పటి వరకు 74 కోట్ల విలువైన మద్యం, ఇతర వస్తువుల్ని సీజ్ చేశారు.