రాయ్‌పూర్: మావోయిస్టుల తిరుగుబాటుకు పర్యాయపదంగా మారిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితా నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తొలగించింది. ఈ జాబితా నుంచి కొండగావ్ను కూడా తొలగించింది. ఈ రెండు జిల్లాల్లోనూ మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గినప్పటికీ, కట్టుదిట్టమైన నిఘా పెట్టడం అవసరమని, అభివృద్ధిపై దృష్టి సారించవలసి ఉందని తెలిపింది.
బస్తర్ డివిజన్లోని సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాలు ఇప్పటికీ వామపక్ష తీవ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన జిల్లాలుగానే కొనసాగుతున్నాయి. ఇటీవలే మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజు మరో 27 మంది భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించిన సంగతి తెలిసిందే.