రాయ్పూర్: చత్తీస్ఘడ్ మాజీ సీఎం భూపేశ్ భగల్(Bhupesh Baghel).. రాజ్నందగావ్ లోక్సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ ఓటర్లు తనను గెలిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ స్థానం బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే ఆధీనంలో ఉన్నది. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి బోలారామ్ సాహూపై సంతోష్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచారు. చత్తీస్ఘఢ్లో ఉన్న 11 లోక్సభ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7వ తేదీల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. రాజ్నందగావ్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్నందగావ్ సెమీ అర్బన్ నియోజకవర్గం. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర బోర్డర్లతో ఆ నియోజకవర్గానికి లింకు ఉంటుంది.
राजनांदगांव लोकसभा के हर नागरिक के भरोसे को साक्षी मानकर आज नामांकन दाखिल किया है.#जीतेंगे_राजनांदगांव pic.twitter.com/uzBYLHWEYp
— Bhupesh Baghel (@bhupeshbaghel) April 2, 2024