Aneeta Sharma | హిందూ రాజ్యం కోసం ఏకం కావాలి : కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
హిందూ రాజ్య నిర్మాణానికి పూనుకోవాలని చత్తీస్ఘడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనితా శర్మ (Aneeta Sharma) పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. హిందూ రాజ్య ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.
రాయ్పూర్ : హిందూ రాజ్య నిర్మాణానికి పూనుకోవాలని చత్తీస్ఘడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనితా శర్మ (Aneeta Sharma) పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. హిందూ రాజ్య ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. పూరి శంకరాచార్య, స్వామి నిశ్చలానంద సరస్వతి జయంతోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మనమంతా ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలి..హిందూ రాజ్య ఏర్పాటుకు ప్రతిన బూనాలి, హిందువులు ఐక్యంగా ముందుకు కదిలితేనే ఇది సాధ్యమవుతుందని అనితా శర్మ పేర్కొన్నారు. శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది.
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అనితా శర్మ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, దేశంలో భిన్న మతాల వారు సామరస్యంగా జీవిస్తున్నారని, దాన్ని తాము విచ్ఛిన్నం చేయబోమని పేర్కొన్నారు. తమ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలను ఏకం చేసేందుకే భారత్ జోడో యాత్రను చేపడితే కాషాయ నేతలు మాత్రం సమాజంలో విభజన చిచ్చుకు కుట్ర పన్నుతున్నారని ఆమె మండిపడ్డారు.
Read More
Cyclone Biparjoy | గుజరాత్లో బిపర్జాయ్ బీభత్సం.. వరద తాకిడికి కూలిన వంతెన.. రోడ్డుపై రాకపోకలు బంద్.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

