Chewing gum | న్యూఢిల్లీ: చూయింగ్ గమ్‌ను నమిలినపుడు నోట్లోకి వందలాది మైక్రోప్లాస్టిక్స్ విడుదలవుతాయి. రబ్బర్ ఆధారిత స్వీట్ వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో ఇవి వెల్లడయ్యాయి. ప్రధాన పరిశోధకుడు సంజయ్ మొహంతి మాట్లాడుతూ చూయింగ్ గమ్ ద్వారా శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్ వెళ్తున్నట్లు తాజా పైలట్ స్టడీ వెల్లడించిందని చెప్పారు.
ఒక గ్రాము గమ్ సగటున 100 మైక్రోప్లాస్టిక్ ముక్కలను విడుదల చేస్తుందని తెలిపారు. కొన్ని చూయింగ్‌గమ్స్ 600కుపైగా కణాలను విడుదల చేస్తాయన్నారు. సంవత్సరానికి 180 చూయింగ్ గమ్‌లను నమిలితే 30,000 మైక్రోప్లాస్టిక్స్ విడుదలవుతాయని చెప్పారు. సాధారణంగా వాడే సింథటిక్ గమ్‌లో పెట్రోలియం ఆధారిత పాలిమర్స్ ఉంటాయి. అయితే, దానిలో ప్లాస్టిక్స్ ఉన్నట్లు ప్యాకేజింగ్‌పై రాయరు.