న్యూఢిల్లీ, జూలై 12: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చీతాల మరణాలు ఆగటం లేదు. తాజాగా మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన నభా అనే ఆడ చీతా మరణించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
నభా వయస్సు ప్రస్తుతం 8 ఏండ్లని వారు తెలిపారు. వారం రోజుల క్రితం నభా తీవ్రంగా గాయపడినట్టు అధికారి ఉత్తమ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. వేటాడే సమయంలో అది గాయపడిందని, వారం రోజులుగా చికిత్స అందించామని, గాయాలు తీవ్రంగా ఉండటంతో మరణించనట్టు వెల్లడించారు. శవపరీక్ష తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. మనదేశంలో అంతరించిపోతున్న చీతాలను రక్షించేందుకు ‘ప్రాజెక్ట్ చీతా’ను కేంద్రం చేపట్టింది.