గురుగ్రామ్, సెప్టెంబర్ 21: చికాకు పెట్టించే స్పామ్ మెసేజ్లకు చెక్ పెట్టే కొత్త ఫీచర్ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. ‘బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్’ అనే ఈ ఫీచర్ ద్వారా అన్నోన్(తెలియని నెంబర్లు) అకౌంట్ల నుంచి మెసేజ్లు రాకుండా బ్లాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ను ఉపయోగించి గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్లకు అడ్డకట్ట వేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పలువురు బెటా టెస్టర్లకు వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే వినియోగదారులు అందరికీ ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నది. వాట్సాప్ అకౌంట్కు ఈ ఫీచర్ రక్షణగా ఉంటుందని, డివైజ్ పనితీరును మెరుగుపరుస్తుందని వాట్సాప్ తెలిపింది.