
ప్రాణముప్పు తగ్గినట్టు పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: రక్తం పలుచబడేందుకు వాడే ఔషధాల (బ్లడ్ థిన్నర్స్) వల్ల కరోనా నుంచి రక్షణ లభిస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. బ్లడ్ థిన్నర్స్ వల్ల కరోనా రోగులకు మృత్యు ముప్పు 50 శాతం, దవాఖానలో చేరాల్సిన అవసరం 43 శాతం తగ్గినట్టు లాన్సెట్ ఈక్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన ఆ పరిశోధన వివరించింది. అమెరికాలోని పలు దవాఖానల్లో గత ఏడాది మార్చి 4 నుంచి ఆగస్టు 27 వరకు 18 ఏండ్లు పైబడిన 6,195 మంది రోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు.