దుర్గ్: లిక్కర్ స్కామ్ కేసులో చత్తీస్ఘడ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్(Chaitanya Baghel)ను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 2100 కోట్ల లిక్కర్ స్కామ్‌తో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం దుర్గ్ జిల్లాలోని బిలాయి పట్టణంలో ఉన్న నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. రెయిడ్స్ ముగిసిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు.
చైతన్య భగేల్‌పై ఈడీ విచారణ చేపట్టడం ఈ ఏడాది ఇది రెండోసారి. లిక్కర్ స్కామ్‌లో తమకు కొత్త ఆధారాలు దొరికినట్లు ఈడీ చెబుతోంది. అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడంతో రాజకీయ కక్షతో ఈడీ సోదాలు చేపడుతున్నారని మాజీ సీఎం భూపేశ్ భగేల్ ఆరోపించారు.
మార్చి 10వ తేదీన కూడా చైతన్య భగల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.