Lakhimpur Kheri Case: డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతిపై ఛార్జ్‌షీట్

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటన కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్, తాజాగా మరో నాలుగు ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. వాహనం డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తల మరణానికి సంబంధించి ఏడుగురిపై అభియోగాలు మోపింది. బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి శుక్రవారం 500 పేజీలతో కూడిన నాలుగు ఛార్జ్షీట్లను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సిట్ దాఖలు చేసింది.
గతేడాది అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో హింస చెలరేగింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, రోడ్డుపక్కన నిరసన చేస్తున్న రైతులను తన వాహనంతో తొక్కించి చంపినట్లు రైతులు ఆరోపించారు. ఈ ఘటనతోపాటు ఈ సందర్భంగా చెలరేగిన హింసాకాండలో నలుగురు రైతులు, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్, స్థానిక జర్నలిస్టు సహా ఎనిమిది మంది మరణించారు.
ఈ కేసు ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను గత ఏడాది అక్టోబర్ 9న పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఆయన జైలులో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మొదటి ఎఫ్ఐఆర్, గత ఏడాది నంబర్లో నమోదైంది. నలుగురు రైతులు, జర్నలిస్ట్ మరణాలకు సంబంధించి రైతు జగ్జీత్ సింగ్, ఒక జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోను, సన్నిహితుడు సుమిత్ జైస్వాల్‌తో సహా 15-20 మందిపై ఆరోపణలు చేశారు.
రెండవ ఎఫ్ఐఆర్ కూడా నవంబర్‌లో నమోదైంది. ఇద్దరు పార్టీ కార్యకర్తలు, ఒక డ్రైవర్ మృతికి సంబంధించి బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్ ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఆరోపణలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

