శ్రీహరికోట: ఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్-3(Chandrayaan-3) పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఇవాళ ఎల్వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ గాలిలోకి ఎగిరింది. ఆ తర్వాత అన్ని దశల్లోనూ ఆ రాకెట్ బూస్టర్లు సక్రమంగా మండాయి. ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్-3 వెళ్తోంది. ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ఆ ల్యాండర్ దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు పేలోడ్‌లో ప్రత్యేక పరికరాన్ని పంపుతున్నారు.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches #Chandrayaan-3 Moon mission from Satish Dhawan Space Centre in Sriharikota.
Chandrayaan-3 is equipped with a lander, a rover and a propulsion module. pic.twitter.com/KwqzTLglnK
— ANI (@ANI) July 14, 2023
ఇస్రో ప్రయోగాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం వచ్చారు. సతీశ్ ధావన్ సెంటర్ వద్ద ఉన్న గ్యాలరీ నుంచి ఆ ప్రయోగాన్ని వీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలు, మాజీ శాస్త్రవేత్తలు కూడా చంద్రయాన్ ప్రయోగాన్ని వీక్షించారు. 613 కోట్లతో చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.
రాకెట్ నుంచి చంద్రయాన్-3 విజయవంతంగా వేరుపడింది. చంద్రయాన్ విడిపోగానే ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరికి ఒకరు విషెష్ చేసుకున్నారు. కక్ష్యలోకి చంద్రయాన్ ప్రవేశించిందని, అది చంద్రుడి దిశగా తన పయనాన్ని మొదలుపెట్టినట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. పారామీటర్స్ అన్నీ నార్మల్‌గా సాగుతున్నట్లు ఇస్రో శాస్త్రవేత్త తెలిపారు. మూన్ జర్నీ ఇప్పుడే మొదలైనట్లు మిషన్ డైరెక్టర్ పేర్కొన్నారు.
Celebrations at the Indian Space Research Organisation (ISRO) following the successful launch of #Chandrayaan3 into orbit. pic.twitter.com/v62kzhAD8D
— ANI (@ANI) July 14, 2023
చంద్రయాన్ కక్ష్యలోకి ప్రవేశించగానే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ఇస్రో చీఫ్‌కు కంగ్రాట్స్ తెలిపారు. ఇద్దరూ చంద్రయాన్ నమోనాను ప్రదర్శించారు. ఈ ప్రయోగం దేశానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఇండియాను ఉన్నతస్థాయిలో నిలిపిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు.
#WATCH | Union Minister of State for Science and Technology Jitendra Singh congratulates ISRO Chairman S Somanath and his team for the successful launch of Chandrayaan 3 India's 3rd Moon mission. pic.twitter.com/NJjvb3Q4Cg
— ANI (@ANI) July 14, 2023
ఎల్వీఎంలో ఇది ఏడో వెహికిల్ అని, అన్నీ సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి దూసుకువెళ్లాయని, దీంతో ఎల్వీఎంలో వంద శాతం మన పర్ఫెక్ట్గా ఉన్నామని ఇస్రో శాస్త్రవేత్త తెలిపారు. ఎల్వీఎం3 ఎం4 రాకెట్ విజయవంతంగా చంద్రయాన్3ని కక్ష్యలోకి తీసుకువెళ్లినట్లు ఇస్రో తన ట్విట్టర్లో తెలిపింది. కక్ష్యలోకి వెళ్లిన చంద్రయాన్-3 ఇక మూన్ దిశగా తన జర్నీ మొదలుపెట్టినట్లు ఇస్రో పేర్కొన్నది. స్పేస్‌క్రాఫ్ట్ హెల్త్ నార్మల్‌గా ఉన్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది.
Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon.
Health of the Spacecraft is normal.— ISRO (@isro) July 14, 2023
LVM3 M4/Chandrayaan-3 Mission:
LVM3 M4 vehicle🚀 successfully launched Chandrayaan-3🛰️ into orbit.— ISRO (@isro) July 14, 2023