చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం శ్రీహరికోట నుంచి మూడవ మూన్ మిషన్ చంద్రయాన్ -3(Chandrayaan 3) ను విజయవంతంగా నింగిలోకి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలలకు చెందిన జనం చాలా ఆసక్తి చూపారు. చాలా మంది ఇస్రో లైవ్ టెలీకాస్ట్‌ను టీవీల్లో, సోషల్ మీడియాలో తిలకించారు. అయితే ఒక విమానం గాల్లో ఎగురుతుండగా అందులోని ప్రయాణికులు కూడా ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించారు. నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 ప్రయోగాన్ని స్వయంగా చూశారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 (LVM-3) రాకెట్ చంద్రయాన్-3ను ఆకాశంలోకి మోసుకెళ్లడాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.
కాగా, శుక్రవారం చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో ఇండిగో సంస్థకు చెందిన విమానం చెన్నై నుంచి ఢాకా వెళ్తున్నది. దీంతో ఈ చారిత్రక సంఘటనను చూడాలని విమాన ప్రయాణికులకు పైలట్ సూచించాడు. ఈ నేపథ్యంలో ఆకాశంలో ఎగురుతున్న విమానం విండోస్ నుంచి చంద్రయాన్-3 ప్రయోగాన్ని కొందరు వీక్షించారు. దీనిని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఇస్రో మాజీ డైరెక్టర్, రాకెట్ తయారీ నిపుణుడు డాక్టర్ పీవీ వెంకటకృష్ణన్ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘విమానం నుంచి చంద్రయాన్ 3 ప్రయోగం’ అని క్యాప్షన్ ఇచ్చారు. ది చెన్నై స్కైస్ అనే ట్విట్టర్ యూజర్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Launch of Chandrayan 3 from flight. Sometime after takeoff from Chennai to Dhaka flight, pilot announced to watch this historical event pic.twitter.com/Kpf39iciRD
— Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) July 15, 2023
When #aviation meets 🤝#astronomy!
A passenger aboard @IndiGo6E 's #Chennai– #Dhaka flight has captured this beautiful liftoff of #Chandrayaan3 🚀 😍
Video credits to the respective owner.@ISROSpaceflight @SpaceIntel101 @Vinamralongani @elonmusk @ChennaiRains #ISRO pic.twitter.com/YJKQFeBh9b
— The Chennai Skies (@ChennaiFlights) July 14, 2023