కొత్తగూడెం ప్రగతి మైదాన్, అక్టోబర్ 29 : చంద్రన్న లాంటి విప్లవ ద్రోహులకు విప్లవకారులమని చెప్పుకునే అర్హత లేదని మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి గణేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో సామాజిక మాధ్యమంలో బుధవారం లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న ఈ నెల 28న హైదరాబాద్లో పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం విదితమే.
ప్రభుత్వం ఎదుట లొంగిపోయి, తాను విప్లవకారుడిని అని చెప్పుకునే అర్హతను చంద్రన్న కోల్పోయాడన్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీగా దేవ్జి (తిప్పిరి తిరుపతి) ఎన్నికయ్యారని చేసిన ప్రకటన అబద్ధమన్నారు.