న్యూఢిల్లీ : అమెరికా-భారత్ మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ సోమవారం చండీగఢ్‌లో రైతులు మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఒకవేళ ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేస్తే అదే రోజు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ-రాజేవాల్) నాయకులు కేంద్రాన్ని హెచ్చరించారు.
రైతుల నిరసన కారణంగా చండీగఢ్‌లోని పలుమార్గాల్లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రైతు నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఒప్పందం వల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు భారతీయ మార్కెట్లలోకి భారీగా ప్రవేశించే అవకాశముందని, తద్వారా భారత రైతుల ఆదాయం దెబ్బతినవచ్చునని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు.