న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ( Train derailed ). ఈ ఘటనలో రైలుపై ఉన్న ఎనిమిది వ్యాగన్లు బోల్తాపడ్డాయి. రైలు అలహాబాద్ నుంచి ఢిల్లీలోని పండిట్ దీనదయాల్ ఉపాధ్యయ యూనివర్సిటీ జంక్షన్‌కు వెళ్తుండగా ఉదయం 6 గంటల 40 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
అయితే ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వ్యాస్‌నగర్ మీదుగా దీన్‌దయాల్ యూనివర్సిటీ జంక్షన్‌కు రైళ్లను డైవర్ట్ చేస్తున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాజేశ్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. లోకో పైలెట్లు క్షేమంగానే ఉన్నారని చెప్పారు.
Chandauli: 8 wagons of a container train from Allahabad to Pt. DDU JCT derailed around 6:40 this morning. Restoration work underway; services interrupted on the said route. Trains on the route will either be diverted or will be coming via Vyas Nagar to DDU: Rajesh Kumar, CPRO,ECR pic.twitter.com/RvQ06iUg2c
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 17, 2021