న్యూఢిల్లీ: నేడు పిల్లలు, పెద్దలు ప్యాకేజ్డ్ ఫుడ్‌కు అలవాటు పడ్డారు. అయితే నిత్యం ఈ తరహా ఆహారాన్ని తింటున్నవారికి ‘గుండె పోటు’ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. పరిశ్రమల్లో తయారైన ఆహారం రుచి, వాసన చెడిపోకుండా ఉండేందుకు, నిల్వకాలం పెంచేందుకు మిశ్రమ ద్రావణాల్ని (ఎమల్సిఫైర్స్) వాడతారు. కేక్స్, ఐస్‌క్రీం, చాక్లెట్స్, బ్రెడ్, ప్యాస్ట్రీ.. మొదలైనవాటిలో ‘ఎమల్సిఫైర్స్’ను కలుపుతారు. ఇది పేగుల్లో మంచి బ్యాక్టిరియాను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు.