చంపై సొరేన్ సెరైకెల్లా నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జేఎంఎంలో చేరకముందు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిపొందారు. ప్రస్తుతం రవాణాశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన చంపై..‘జార్ఖండ్ టైగర్’గా పేరొందారు.
హేమంత్ సొరేన్ తండ్రి శిబు సొరేన్‌కు అత్యంత ఆప్తుడిగా, ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత సీనియర్ మంత్రిగా ఉన్నారు. 2010-13లో అర్జున్ ముండా నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌లోనూ మంత్రిగా పనిచేశారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు.