న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 13 రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)తో రుణ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందరం ప్రకారం 13 రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయడం కోసం ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ( Asian Development Bank ) దేశాకి 300 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వనుంది.
ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఏడీబీ మధ్య మంగళవారం అధికారిక ఒప్పందం కుదిరింది. ఈ రుణంతో పట్టణ ప్రాంతాల్లోని 256 మిలియన్ల మందికి ప్రయోజనం కలుగుతుందని, వారిలో 51 మిలియన్ల మంది మురికివాడల్లో నివాసం ఉండేవాళ్లు ఉన్నారని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొన్నది.