Digital Platforms | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: డిజిటల్ వేదికలలో హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడానికి ప్రస్తుతమున్న చట్టబద్ధమైన నిబంధనలు, చట్టపరంగా కొత్త నిబంధనలు ఏమన్నా తీసుకురావాల్సిన అవసరం ఉందా అన్న అంశాలను కేంద్ర సమాచారశాఖ పరిశీలిస్తున్నది. ఒక హాస్య కార్యక్రమంలో భారతీయ కుటుంబ వ్యవస్థను కించపరిచేలా, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన దారుణమైన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వాటిపై నిఘా పెంచాలని యోచిస్తున్నది.
ఈ అంశంపై పార్లమెంటరీ ప్యానెల్ పంపిన ప్రశ్నలకు సమాచార, ప్రసార శాఖ సమాధానం ఇస్తూ ప్రస్తుత చట్టం లో వీటి నిరోధానికి నిబంధలను ఉన్నప్పటికీ, ఇలాం టి హానికరమైన కంటెంట్‌ను నిరోధించడానికి కఠినంగా చట్టంలో నిబంధనలు పొందుపర్చాలన్న డిమాండ్లు అధికమవుతున్నాయని తెలిపింది.