AAP | ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం : ఢిల్లీ మంత్రి అతిశీ
AAP | రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన (Presidents Rule) విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి (AAP Minister) అతిశీ తాజాగా ఆరోపించారు.
AAP | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌తో దేశరాజధానిలో రాజకీయాలు హీటెక్కాయి. తమ సుప్రిమోను తప్పుడు కేసులో, రాజకీయ కక్షతోనే బీజేపీ (BJP) ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని ఆప్ ఆరోపిస్తోంది. తాజాగా మరోసారి ఆప్ ప్రభుత్వం బీజేపీపై నిప్పులు చెరిగింది.
రాజధానిలో రాష్ట్రపతి పాలన (Presidents Rule) విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి (AAP Minister) అతిశీ తాజాగా ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని చెప్పారు. శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో అతిశీ మాట్లాడుతూ.. ‘ఎలాంటి ఆధారాలూ లేకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని (Delhi government) కూలదోసేందుకు కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో కేజ్రీవాల్ అరెస్ట్ ఓ భాగం. గతంలో జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే బాగా ఆలోచించి కుట్ర చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది’ అని మంత్రి అతిశీ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీని తొలగిచడం కూడా కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు.
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా అధికార నియామకాలను చేపట్టడం లేదని అతిశీ తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు కొన్ని నెలలుగా నిలిచిపోయాయని చెప్పారు. ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచీ అధికారులు సమావేశాలకు కూడా హాజరుకావడం మానేశారని మంత్రి వెల్లడించారు.
#WATCH | Delhi Minister & AAP leader Atishi says, “Arvind Kejriwal has been arrested in a fake case and that too without any proof because there is a conspiracy to topple the elected govt of Delhi. when we see a few things from the past, it shows that there has been a… pic.twitter.com/kcGcqRIpde
— ANI (@ANI) April 12, 2024
Also Read..
Bengaluru cafe blast | బెంగళూరు కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ఇద్దరు కీలక నిందితులు
Family Visa | యూకే ఫ్యామిలీ స్పాన్సర్ వీసా మరింత కఠినతరం.. ఆదాయ పరిమితి 55 శాతానికి పెంపు
Cannabis | బంగ్లాపై గంజా సాగు.. బ్రిటన్ పౌరుడు అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

