Family Visa | యూకే ఫ్యామిలీ స్పాన్సర్ వీసా మరింత కఠినతరం.. ఆదాయ పరిమితి 55 శాతానికి పెంపు
Family Visa | వలసలను అడ్డుకునేందుకు యూకే ప్రభుత్వం (UK government) మరో కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
Family Visa | వలసలను అడ్డుకునేందుకు యూకే ప్రభుత్వం (UK government) మరో కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. యూకేకు వచ్చే వారికి ఫ్యామిలీ వీసా (Family Visa)ను స్పాన్సర్ చేసే బ్రిటన్ పౌరులు, నివాసితులపై కనిష్ఠ ఆదాయ పరిమితిని భారీ స్థాయిలో పెంచేసింది.
బ్రిటిష్ పౌరులు, శాశ్వత నివాసితులు తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతానికి పెంచింది. ప్రస్తుత ఆదాయ పరిమితి 18,600 పౌండ్లుగా ఉండగా దానిని 29,000 పౌండ్లకు చేర్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో సమానంగా కుటుంబ వీసాల కోసం వేతన పరిమితిని 38,700 పౌండ్లకు పెంచనున్నట్లు సునాక్ ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, ఉపాధి వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ గతేడాది డిసెంబర్లోనే యూకే ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టింది. కుటుంబ వీసా కోసం వేతన పరిమితి 38,700 పౌండ్లకు పెంచాలని నిర్ణయించింది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గింది. రెండు దశల్లో ఈ పెంపును అమలు చేస్తామని ప్రకటించింది.
Also Read..
Bengaluru cafe blast | బెంగళూరు కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ఇద్దరు కీలక నిందితులు
Lok Sabha Elections | మూడో విడుత నామినేషన్లు షురూ.. 94 ఎంపీ స్థానాల్లో మే 7న పోలింగ్
Om Bheem Bush | ఓం భీమ్ బుష్‌ను థియేటర్లలో మిస్సయ్యారా.. మీ కోసమే ఈ అప్డేట్..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

