Om Bheem Bush | హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కథను నమ్మి సినిమాలు చేసే హీరోల్లో టాప్‌లో ఉంటాడు శ్రీవిష్ణు (Sree Vishnu). ఈ టాలెంటెడ్ హీరో కాంపౌండ్ నుంచి కామెడీ జోనర్లో వచ్చిన మూవీ ఓం భీమ్ బుష్ (Om Bheem Bush). రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. మార్చి 22న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలతో స్క్రీనింగ్ అయిన ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి థియేటర్లలో మిస్ అయిన వాళ్లు చూసి ఎంజాయ్ చేసేయండి. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్, మనీశ్ కుమార్, రచ్చ రవి ఇతర కీలక పాత్రల్లో నటించారు.
బ్రోచెవారెవరురా కోస్టార్లు శ్రీవిష్ణు , రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబోలో వచ్చిన రెండో సినిమా ఇది. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో యూవీ సెల్యూలాయిడ్, సునీల్ తెరకెక్కించారు. మిస్టరీ, థ్రిల్ ఎలిమెంట్స్‌తో ఇప్పటివరకూ రాని పాయింట్‌తో సినిమా ఉండబోతుందని ఇప్పటికే శ్రీవిష్ణు క్లారిటీ ఇచ్చాడు.
ఓం భీమ్ బుష్ ఓటీటీ అప్డేట్..
🔔 Telugu movie #OmBheemBush (2024) now streaming on Prime Video.https://t.co/dFUutwUuPH
— Ott Updates (@Ott_updates) April 12, 2024
ఓం భీమ్ బుష్ ట్రైలర్..
ఓం భీమ్ బుష్ టీజర్..